AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.