HYD: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వేంకటేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలు చేశారు. ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.