SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 1 రైతుల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు జిన్నారం MRO, ADల ఆధ్వర్యంలో మంగళవారం సర్వే ప్రారంభమైంది. త్వరలోనే రైతులకు న్యాయం జరిగే ప్రక్రియ మొదలవుతుందని అధికారులు తెలిపారు. సర్వే జరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.