NGKL: ముక్కోటి ఏకాదశి పర్వదినాని పురస్కరించుకొని పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి BRS శ్రేణులతో కలిసి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.