»Minister Satyavati Rathod Getting Cm Kcrs Name Tattooed Video Viral
Satyavathi Rathod: సీఎం కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకున్న మహిళా మంత్రి..వీడియో వైరల్
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టగా వేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR)పై రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi Rathod) తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. కేసీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు. శనివారం గిరిజన యోధుడు కొమురం భీమ్ సహచరుని వారసులతో మంత్రి పచ్చబొట్టు వేసుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Videos Viral) అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకుంటున్న మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో:
బంజారా భవన్(Banjara Bhavan)లో నిర్వహించిన పలు కార్యక్రమాలకు మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi Rathod) హాజరయ్యారు. బంజారాలు, ఆదివాసీలు సిద్ధం చేసిన పలు రకాల ఉత్పత్తులను, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఆమె సందర్శించారు. అక్కడే పచ్చబొట్టు స్టాల్ ఉండటంతో మంత్రి తన చేతిపై మంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. నొప్పిని భరిస్తూనే ఆమె పచ్చబొట్టు వేసుకోవడం వీడియో(Video)లో కనిపిస్తుంది.
కొమురం భీమ్ సహచరుడు అయిన వెడ్మ రాము కోడలు రాంబాయి స్వయంగా మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi Rathod)కు పచ్చబొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందిస్తూ మంత్రి బహుమానం అందజేశారు. సీఎం కేసీఆర్(CM KCR) గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని, అనేక సంక్షేమ పథకాలు(Welfare Schemes) ప్రవేశ పెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.