»Nara Lokesh Selfie Is A Direct Evidence Of Ycp Sand Mafia
YSRCP: ఇసుక మాఫియాకు ప్రత్యక్షసాక్ష్యమంటూ లోకేశ్ సెల్ఫీ
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఇసుక దందాకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న క్రమంలో లోకేష్ అక్రమ ఇసుక ఉన్న చోట సెల్ఫీ చిత్రం దిగి నిరసన వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(nara Lokesh) యువగళం పాదయాత్ర 122వ రోజు కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని జంగాలపల్లె విడిది కేంద్రం నుంచి మొదలైంది. ఆ క్రమంలో సిద్ధవటం మండలం జంగాలపల్లెకు చేరుకున్న లోకేష్ పెన్నానదిని తోడేసి వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి అక్రమంగా ఇసుక(sand)ను పోగుచేశారని పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఇసుక డంపింగ్ యార్డు దగ్గర సెల్ఫీ కూడా దిగారు. ఆ నేపథ్యంలో రాజంపేట ఎమ్మెల్యే స్థానిక వనరులను దోచుకునేందుకు ప్రాధ్యానత ఇస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
ఇంత దగ్గరలో పెన్నానది ఉన్నా కూడా స్థానిక ప్రజల(people)కు మాత్రం ఇసుక దోరగడం లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడి ఇసుక మొత్తం బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు అక్రమంగా తరలివెళ్తుంటే స్థానిక ప్రజల పరిస్థితి ఏంటని లోకేష్ ప్రశ్నించారు. అలా అనేక రోజులుగా వైసీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. జగన్ రెడ్డి పాపల పట్టు మాదిరిగా ఇసుక మాఫియా రాష్ట్ర్లంలో పెరిగిపోతుందని లోకేష్ విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా నారా లోకేష్ ను కలిశారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నిర్వహించిన యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర ఈనెల 13న నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.