WGL: చెన్నారావుపేట మండలం నౌషతాండ సర్పంచ్ భూక్య ఉమ మోహన్ నాయక్ మాణిక్య తండా అంగన్వాడీ సెంటర్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. వయస్సుకు తగ్గట్టు బరువు, ఎత్తు ఉండాలన్నారు.