మంచిర్యాల (Manciryala) సీఎం కేసీఆర్ బహిరంగ సభలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సభా ప్రాంగణంలో డ్రోను కెమెరాలు (Drone cameras) ఎగిరాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సభా వేదికపై పాట పాడుతున్న ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Saichand)ను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. డ్రోన్లను దించేలా అనౌన్స్ చేయాలని సాయిచంద్, బాల్క సుమన్ (Balka Suman) ను భద్రతా సిబ్బందిని కోరారు. జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నస్పూర్ వద్ద ఏర్పాటు చేసిన సభ బహిరంగ సభలో కేసీఆర్ (CM KCR) పాల్గొనేకంటే ముందు ఘటన జరిగింది .వారు మైక్‌లో అనౌన్స్ లో చేసినప్పటికీ డ్రోన్లు కిందకు దించలేదు. దీంతో ఏకంగా సెక్యూరిటీ సిబ్బందినే మైక్‌లో అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సీఎం సభలో డ్రోన్లకు అనుమతి లేదు. ఎక్కడా డ్రోన్స్ ఉన్నా తీసేయాలి. భద్రతా దృష్ట్యా డ్రోన్లను తక్షణమే కిందకు దించి, నిలిపివేయాలని సెక్యూరిటీ ఆఫీసర్(Security Officer) అనౌన్స్ చేశారు. డ్రోన్లు ఎగిరినంత సేపు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
చదవండి : Schools : ఏపీలో స్కూల్స్ రీఓపెనింగ్‌పై విద్యాశాఖ ఏం చెప్పిందంటే?
Tags :