కోనసీమ: అమలాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీ సుబ్బాలమ్మ, నూకాలమ్మ మరియు రాజ్యలక్ష్మి అమ్మవార్ల జాతర తీర్థ మహోత్సవాల ఆహ్వాన పత్రికను స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆ త్రిమాతల ఆశీస్సులతో మన నియోజకవర్గం పాడిపంటలతో తులతూగాలని, ప్రతి ఇంటా సౌభాగ్యం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.