VZM: మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయు) జిల్లా కమిటీ నాయకుడు దుర్గారావు డిమాండ్ చేశారు. మోయిద జంక్షన్లో శనివారం జరిగిన నిరసనలో మాట్లాడుతూ.. గతంలో కుదిరిన ఒప్పందాలకు ఇప్పటివరకు జీవోలు జారీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.