NRML: కుబీర్ మండలం శివుని తండా గ్రామపంచాయతీని MPO అష్టం భీమేష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయం, రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలోని నర్సరీని సందర్శించారు. శ్మశాన వాటిక పనులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.