తెలంగాణ(Telangana)లో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ తుది దశకు చేరుకుంది. తుది పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) షెడ్యూలను టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) రిలీజ్ చేసింది.ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ (Constable) పోస్టులకు సంబంధించి మొత్తం1,02,048 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
జూన్ 12న ఉదయం 8 గంటల నుంచి 13న రాత్రి 8 గంటలకు వరకు అభ్యర్థుల ఇంటిమేషన్ లెటర్లు (Intimation letters)అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో తమకు కేటాయించిన కేంద్రంలో ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ (Report)చేయాల్సి ఉంటుంది. ఇంటిమేషన్ లెటర్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు వెబ్సైట్(Website)లో అందుబాటులో ఉండనున్నాయి.