»Complaint Against Director And Heroine Adipurush Caught In Controversy Again
Adipurush: మళ్లీ వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్..డైరెక్టర్, హీరోయిన్ పై ఫిర్యాదు
ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Adipurush) మూవీ మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంపై తిరుపతి(tirupati)లోని పోలీస్ స్టేషన్లో ఓ కంప్లైంట్ నమోదైంది. ఇటివల తిరుమల ఆలయం బయట ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌లు ‘ముద్దులు, కౌగిలింత’ సంఘటనపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రముఖులపై తిరుపతిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగిస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు వారిపై చర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు పోలీసులను కోరారు. మరోవైపు ఈ సంఘటనపై ప్రముఖ చిలుకూరి ఆలయం అర్చకులు రంగరాజన్ కూడా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
మొదటి నుంచి పలు కారణాలతో వివాదాల్లో చిక్కుకున్న ఆదిపురుష్ సినిమాకు..ఇప్పుడు ఈ కంప్లైంట్(compliant) తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. మరోవైపు గతంలో సంజయ్ దీనానాథ్ తివారీ అనే వ్యక్తి ‘రామచరిత మానస్’ గ్రంథం ప్రకారం శ్రీరాముడిని తప్పుగా చూపించారని నిర్మాత, దర్శకుడు ఆదిపురుష్‌పై ముంబైలోని సకినాకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని 295 (A), 298, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాముడి పాత్రలో ప్రభాస్ వేషధారణ నమ్మకాల ప్రకారం లేదని మర్యాద పురుషోత్తమ’గా పిలవబడే శ్రీరాముడి వేషధారణకు సంబంధించిన ఆధారాలను నమోదు చేశారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఒక క్షత్రియ రాజుగా శ్రీరాముడి పాత్రను పోషించే నటుడు తప్పనిసరిగా అతను పేర్కొన్న పవిత్రమైన దారం ధరించాలని వెల్లడించారు.