Cop Dance రీల్స్ చేస్తోన్న యువతితో డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబై మెట్రోలో ఓ యువతి డ్యాన్స్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్కి తగిలింది. అతను సరదాగా ఉండటంతో మరోసారి కాలు కదిపింది. ఈ సారి అతను కూడా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
Constable Dance: సోషల్ మీడియా వచ్చిన తర్వాత అద్దు అదుపు లేకుండా పోయింది. మొబైల్ ఉండి, అందులో నెట్ ఉంటే చాలు.. కుర్రకారు రెచ్చిపోతున్నారు. వీడియోలు చేస్తూన్నారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక మెట్రో ట్రైన్లలో డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ మెట్రో అయితే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు అది ముంబై మెట్రోకి (mumbai metro) షిప్ట్ అయ్యింది.
మెట్రోలో ఓ యువతి (girl) డ్యాన్స్ చేస్తోంది. ఇటీవల వచ్చిన యానిమల్ (animal) మూవీలో విలన్ ఇంట్రొడ్యూస్ సాంగ్ అది.. దానికి యువతి స్టెప్పులు వేసింది. ఆమె ముందు ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ యువతి డ్యాన్స్ చేస్తూ.. చేస్తూ.. కానిస్టేబుల్కి తగిలింది. అతను ఏమంటాడో అనుకుని డ్యాన్స్ ఆపేస్తోంది. ఆ వీడియోలో మనం చూడొచ్చు.
అతను మాత్రం సరదాగా ఉన్నాడు. డోర్ పక్కకు వెళుతుండగా.. వెళ్లొద్దు.. పడతావు జాగ్రత్త అని చెప్పాడు. ఇంకేముంది.. ఆ కాప్ తనను ఏమీ అనడని ధీమాతో ఉంది. మరొసారి డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ కూడా కాలు కదిపాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. యువతితో కానిస్టేబుల్ డ్యాన్స్ చేయగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.