»Bangladesh Shocking Goats Released After A Year Of Imprisonment
Bangladesh : షాకింగ్..జైలు శిక్ష అనుభవించి ఏడాది తర్వాత విడుదలైన మేకలు!
9 మేకలు ఏడాది పాటు జైలు శిక్షను అనుభవించాయి. స్వేచ్ఛగా బయట తిరుగుతూ గడ్డి మేయాల్సిన వాటిని జైలులో ఉంచి అధికారులు గడ్డి వేస్తూ వచ్చారు. ఏడాది తర్వాత అవి ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది.
మనుషులు జైలు శిక్ష అనువించడం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం జంతువులు జైలు శిక్ష అనుభవించాయి. ఏడాది జైలు శిక్ష అనుభవించిన తర్వాత అవి ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. బారిసల్ ప్రాంతంలో ఏడాది క్రితం 9 మేకల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ మధ్యనే వాటిని జైలు నుంచి విడుదల చేశారు. ఏడాది జైలు శిక్ష వేయడానికి గల కారణాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
బారిసల్ నగరంలోని శ్మశాన వాటికలోకి 9 మేకలు చొరబడ్డాయి. అక్కడున్న గడ్డిని మేశాయి. అలా ఆ మేకలు ఆ శ్మశానంలో గడ్డి మేసినందుకు బారిసల్ సిటీ కార్పొరేషన్ అధికారులు వాటిని జైలు పాలు చేశారు. 2022 డిసెంబర్ 6న ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో మేకల యజమాని షచిబ్ రాజిబ్ పోలీసులను వేడుకున్నారు. తమ మేకల్ని విడిపించాలని ఎంత గగ్గోలు పెట్టినా అధికారులు వినలేదు.
అప్పటి బీసీసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి స్వపోన్ కుమార్ దాస్ ఆ విషయాన్ని ధ్రువీకరించడం విశేషం. అయితే ఈ మధ్యనే ఆ మేకల యజమాని షచిబ్ రాజిబ్ బీసీసీ మేయర్‌కు ఆ మేకలను విడుదల చేయాలని మొరపెట్టుకున్నాడు. దీంతో ఆ మేకలను డిసెంబర్ 8వ తేదిన విడుదల చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బీసీసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అలంగీర్ హుసేన్ ఆదేశాల మేరకు ఆ మేకలను జైలు నుంచి విడుదల చేశారు. ఏడాది పాటు ఆ మేకలను జైల్లోనే ఉంచి అధికారులు గడ్డి వేస్తూ వచ్చారు. ఈ ఆశ్చర్యకర ఘటన గురించి తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.