»Ap High Court On Ap Si Selection Process Height Issue
SI Selection ప్రక్రియ..హైకోర్టు కీలక ఉత్తర్వులు
పోలీసు నియామక ప్రక్రియ విషయంలో ఏపీ హైకోర్టు(ap high court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ఎస్సై ఉద్యోగాల ఎంపిక విషయంలో ఎత్తు కొలిచే సమయంలో తమకు అన్యాయం జరిగిందని పలువురు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ap High Court on ap si selection process height issue
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఎస్సై పోస్టుల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తు కొలిచే(height measurement) విషయంలో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఫలితాలను నిలుదల చేశారు. అయితే ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి ఎత్తు కూడా సరిపోలేదని తిరస్కరించారని అభ్యర్థుల తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయా అభ్యర్థులందరి ఎత్తును మళ్లి కొలవాలని తెలిపింది. ఈ క్రమంలో పిటిషనర్లు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం తెలిపింది.
అంతేకాదు మరోవైపు తెలంగాణ(telangana)లో కూడా ఈవెంట్ల(events) విషయంలో గతంలో కంటే లాంగ్ జంప్, శాట్ పుట్ వంటి ఈవెంట్లను కూడా పెంచారు. ఆ క్రమంలో నిర్వహించిన ఈవెంట్ల ప్రక్రియలో అనేక మంది ఉద్యోగార్థులు గతంలో కంటే ఎందుకు ఈవెంట్లు పెంచారని పలువురిని ప్రశ్నించారు. కానీ వారికి న్యాయం దొరకలేదు. దీంతోపాటు అనేక మంది ఈవెంట్లు పెంచడం వల్ల క్వాలిఫై కాకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈవెంట్ల విషయంలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. తమకు తెలంగాణ పోలీస్ ఈవెంట్లలో అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కనున్నారు.
ఇప్పటికే తెలంగాణలో కానిస్టేబుల్(constable) నియామకాలకు కూడా హైకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబరు 4న ఫలితాలు వెలువడగానే హైకోర్టు వాటిని రద్దు చేసింది. కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి, 4 మార్కులను కలిపి మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాత ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 30న, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం తుది రాత పరీక్ష జరిగినప్పుడు, కొంతమంది అభ్యర్థులు సుమారు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు లేవనెత్తుతూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన కోర్టు.. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించకపోగా 57 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని.. ఈ నాలుగింటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది.