తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.
మహబూబ్ నగర్ (Mahbub Nagar) జిల్లా కేంద్రంలో సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐ గా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సీఐ (CI)ని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధం (Extramarital affair) నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది. సీఐ మర్మాంగాలను కోయడంతో పాటు ఆయన తలపై బలమైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు.
దీంతో సీఐను తొలుత జిల్లా కేంద్రంలోని ఎస్ఈఎస్ ఆస్పత్రి(SES Hospital)కి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడి భార్య కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె మహబూబ్‌నగర్‌లోనే ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ హర్షవర్ధన్ (SP Harshavardhan), అదనపు ఎస్పీ రాములు తదితరులు జిల్లా కేంద్రంలోని ఎస్ఈఎస్ ఆస్పత్రికి వచ్చి సీఐను పరామర్శించారు. హత్యాయత్నం (Attempted murder) జరిగేందుకు గల కారణాలపై మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు వెల్లడించారు