»Actress Jayapradas Reaction To Chandrababus Bail Justice Prevailed
Jayaprada : చంద్రబాబు బెయిల్‌పై నటి జయప్రద స్పందన..న్యాయమే గెలిచింది
తెలుగు దేశం అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌పై విడుదల కావటం పట్ల సినీనటి జయప్రద (Jayaprada) సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచిందన్నారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబుకు ఉపశమనం లభించిందని ఆమె అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం పై సినీ నటి జయప్రద (Jayaprada) స్పందించారు. బాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారని జయప్రద విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశీర్వాదంతో చంద్రబాబుకు బెయిల్ (Bail) వచ్చిందని ఆమె అన్నారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని..ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జయప్రద హితవు పలికారు.
చంద్రబాబు 53 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు(Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు సెంట్రల్ జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఏపీ హైకోర్టు (AP High Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లి (Undavalli) లోని తన నివాసానికి చేరుకోవడానికి ఏకంగా 15 గంటల సమయం పట్టింది. అనంతరం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో వైద్య పరీక్షల అనంతరం బాబు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ మేరకు టీడీపీ (TDP) షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.