»It Raids In Hyderabad Checks At Houses Of Congress Leaders
IT Rides : హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో తనిఖీలు
హైదరాబాద్‌లో ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లీడర్లే టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బండగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ (Hyderabad) లోని పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బడంగ్పేట్, నార్సింగి, బంజారాహిల్స్, తక్కుగూడ ప్రాంతల్లో ఒకేసారి దాడులు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత (Cigirinta Parijata) ఇళ్లలో ఐటీ సోదాలు (IT Searches) కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ శివారులోని బాలాపూర్‌లోని ఆమె నివాసంతోపాటు మరో 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలకు దిగారు. ఈ క్రమంలో పారిజాత కుమార్తె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బడంగ్పేట్ (Badangpet) మేయర్ అయిన పారిజాత ఇల్లుతోపాటు కంపెనీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలంలో బాలపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి (Vangeti Lakshmareddy), మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఐటీ దాడులో జరిగే సమయంలోపారిజాత తిరుపతిలో ఉండగా.. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీ (Delhi)లో ఉన్నారు. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం పారిజాత బడంగ్‌పేట మేయర్ ఉండగా.. ఆమె మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్ పొందటం కోసం టీపీసీసీ రేవంత్ రెడ్డి (Revath Reddy) కి ఆమె రూ.10 కోట్ల నగదు, రూ.5 ఎకరాల భూమి ఇచ్చారని ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ రైడ్స్(IT Rides) జరగటం కలకలం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఐటీ దాడులు నిర్వహిచటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు (Checkposts) ఏర్పాటు చేసి వాహనాల్లో తరలిస్తున్న డబ్బును, విలువైన వస్తువులను సీజ్ చేస్తున్నారు. కానీ ఇలా ఎన్నికల సన్నాహాల్లో ఉన్న రాజకీయ నాయకుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరగటం తెలంగాణలో ఇదే తొలిసారిగా తెలుస్తోంది. అయితే ఈ రైడ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.