చిత్తూరులోని మిట్టూరు షాదీ ఖానాలో ఈనెల 13న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీశాఖ అధికారి హరినాథ్ రెడ్డి తెలిపారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల వరప్రసాదరావు, నగరపాలక మేయర్ అముద, చుడా ఛైర్మన్ కఠారి హేమలత తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.