MDCL: 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అల్వాల్‌లోని హై టెన్షన్ రోడ్‌పై సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.