అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆల్ ది బెస్ట్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే పరీక్ష కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు.