Maruti Suzuki Jimny launched in India at Rs.12.74 lakhs
Maruti Suzuki Jimny: మారుతి సుజుకీ జిమ్నీ (Jimny) కారు.. మహీంద్రా థార్ (thar) కారు పోటీగా వచ్చింది. జనవరిలో బుకింగ్స్ స్టార్ట్ కాగా.. ఈ రోజు నుంచి కార్ల డెలివరీ చేస్తున్నారు. మొత్తం ఆరు కలర్స్‌లో.. ఐదు డోర్లతో కారు అవెలెబుల్గా ఉంది. నెక్సా ఔట్ లెట్ల వద్ద కారు అందుబాటులో ఉంది. నెలకు రూ.33,550 ఈఎంఐ పెట్టుకొని, కారు కొనుగోలు చేసే సదుపాయం ఉంది. ఢిల్లీలో జిమ్నీ బేస్ వేరియంట్ ధర రూ.12.74 లక్షలు కాగా.. హై ఎండ్ మోడల్ రూ.15.05 లక్షలుగా ఉంది.
ఇప్పటివరకు 30 వేల బుక్సింగ్స్ వచ్చాయని మారుతి (maruthi) చెబుతోంది. జిమ్నీ జెటా ఎంటీ వేరియంట్ ధర రూ.12,74 లక్షలు.. జెటా ఏటీ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.94 లక్షలు, ఆల్ఫా ఎంటీ ధర రూ.13.69 లక్షలు, ఆల్ఫా ఏటీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14, 89 లక్షలు, ఆల్ఫా ఎంటీ (డ్యుయల్ టోన్) ధర రూ.13.85 లక్షలు, ఆల్పా ఏటీ డ్యుయల్ టోన్ రూ.15.05 లక్షలుగా ఉంది. ఈ కార్లు అన్నీ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ కే సీరిస్ ఇంజిన్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ ఉంది. 4 స్పీడ్ ఆటోమేటిక్, 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో కారు వస్తోంది. ఏంటీ వేరియంట్ కారు లీటర్ పెట్రోల్‌కు 16.94 కిలోమీటర్ల మైలేజీ, ఏటీ వేరియంట్ 16.39 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోందని మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది.
జిమ్నీ (Jimny) కారు 3985 మిల్లీమీటర్ల పొడవు, 1645 మిల్లిమీటర్ల వెడల్పు, 1720 మిల్లిమీటర్ల ఎత్తు ఉంది. వీల్ బేస్ 2590 ఎంఎంగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 210 ఎంఎంగా ఇచ్చారు. లోపల 9 ఇంచుల టచ్ స్క్రీన్ ఇచ్చారు. వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆర్కిమస్స్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. ఆటో క్లైమెట్ కంట్రోల్, ఎలక్ట్రిసిటీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, క్యూయిజ్ కంట్రోల్ ఉంది.