GDWL: హాల్ టికెట్ కేవలం పరీక్ష గదిలోకి ప్రవేశం మాత్రమే కాదు, మీ కష్టానికి దక్కబోయే ఫలితానికి మొదటి మెట్టు అని గట్టు మండలం చాగదోన జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి అన్నారు. బుధవారం పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒత్తిడిని అధిగమించే చిట్కాలను వివరించారు.