ATP: గుత్తి పట్టణ శివారులోని చెట్నేపల్లి రహదారిలో ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.