»Government Giving Mothly Pension On Expired Person Guntur Andhra Pradesh
Andhra Pradesh: ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం..12 ఏళ్ల తర్వాత గుర్తించిన అధికారులు!
కొడుకు 12 ఏళ్లుగా పింఛన్(Pension) నొక్కేస్తున్నాడు. 2001లో కిరీటి చనిపోయాడు. అయితే ఆ ఏడాదే నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents)ను క్రియేట్ చేసిన శౌరయ్య తన తండ్రి బతికే ఉన్నాడని అధికారులను నమ్మించాడు.
ఏపీ(AP)లో ఓ ప్రేతాత్మకు ప్రభుత్వం పెన్షన్(Government Pension) ఇస్తోందన్న వార్త వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి సర్కార్ ఇంకా పెన్షన్ ఇస్తూనే ఉంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్(viral) కావటంతో ప్రేతాత్మకు ప్రభుత్వం పెన్షన్(pension) ఇస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్, సెటైర్లు వేస్తున్నారు. 2001లో చనిపోయిన తన తండ్రి పేరుపై ఓ కొడుకు ఇలా పెన్షన్ నొక్కేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతనిపై చర్యలు తీసుకున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం క్రోసూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దొడ్లేరు గ్రామానికి చెందిన శౌరయ్య(Sourayya) అనే వ్యక్తి తండ్రి కిరీటి(Kireeti). ఆయన పేరుపై కొడుకు 12 ఏళ్లుగా పింఛన్(Pension) నొక్కేస్తున్నాడు. 2001లో కిరీటి చనిపోయాడు. అయితే ఆ ఏడాదే నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents)ను క్రియేట్ చేసిన శౌరయ్య తన తండ్రి బతికే ఉన్నాడని అధికారులను నమ్మించాడు. తన తండ్రి స్థానంలో మరో వ్యక్తిని చూపెట్టి పెన్షన్ తీసుకుంటున్నాడు.
కిరిటీ(Kireeti) చనిపోయే నాటికి 70 ఏళ్లు కాగా గత 12 ఏళ్లుగా శౌరయ్య తన తండ్రి పెన్షన్(Pension) అందుకుంటూనే ఉన్నాడు. శౌరయ్య చేస్తున్న మోసం గురించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతని నిర్వాకం బయటపడింది. 12 ఏళ్లుగా శౌరయ్య(Sourayya) దాదాపు రూ.4 లక్షల పెన్షన్ ను అందుకున్నాడు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన శౌరయ్యపై చర్యలు తీసుకోవాలని ఆ ఊరి గ్రామస్తుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.