రాజస్ధాన్(Rajasthan)లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూడి సీఎం సచిన్ పైలట్ (Sacin pailaṭ) పార్టీ వీడే అవకాశం ఉంది. తన తండ్రి వర్థంతి అయిన జూన్ 11న కొత్త పార్టీని ప్రకటించునున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొత్త పార్టీపై సచిన్ పైలెట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని కొత్త పార్టీ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ (Progressive Congress) పేరుతోపాటు.. రాజ్ జన సంఘర్ష పార్టీ అనే పేర్లను పరిశీలిస్తున్నారంట. దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
2023 డిసెంబర్ లో రాజస్ధాన్ అసెంబ్లీకి ఎన్నికలు (Assembly elections) జరుగుతున్న క్రమంలో. కాంగ్రెస్ పార్టీ కీలక నేత.. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సచిన్ పైలెట్.. కొత్త కుంపటి పెట్టుకుంటున్నట్లు వస్తున్న కథనాలు.. రాజస్థాన్ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)గా ఉన్న సచిన్ పైలెట్.. డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. కొన్నాళ్ల మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) తో ఉన్న విబేధాలతో.. ఇటీవలే పాదయాత్ర కూడా చేశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సొంత పార్టీపై.. సీఎంపైనే తిరుగుబాటు చేశారు.ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు రావటం.. రాజస్థాన్ రాజకీయాలను హాట్ టాపిక్ చేశాయి.. నిజంగానే జూన్ 11వ తేదీన సచిన్ పైలెట్ కొత్త పార్టీ ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి.