HYD: చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు పాతనేరస్థులతో పాటు ఒక రిసీవర్ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ రెడ్డి(28) ఇప్పటివరకు 88 దొంగతనాలకు పాల్పడటం గమనార్హం. వీరి నుంచి 65 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 13 లక్షలుగా పోలీసులు నిర్ధారించారు.