»Telangana High Court Order To Telangana Government How Can They Give 15 Acres Land Hetero Group
Telangana high court: తెలంగాణ ప్రభుత్వానికి షాక్..15 ఎకరాలు అలా ఎలా ఇస్తారు
తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి (BRS) ఎంపీ, హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారధి రెడ్డి నేతృత్వంలోని సాయి సింధు ఫౌండేషన్ ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమికి హక్కు లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. రూ.500 కోట్లకు పైగా విలువైన భూమిని తక్కువ రుసుముతో లీజుకు తీసుకున్నారనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది.
హైదరాబాద్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని భారత రాష్ట్ర సమితి (BRS) ఎంపీ, హెటిరో గ్రూప్(hetero group) చైర్మన్ బి పార్థ సారధి రెడ్డి నేతృత్వంలోని ఫౌండేషన్‌కు కేటాయించడాన్ని తెలంగాణ హైకోర్టు(telangana high court)సోమవారం రద్దు చేసింది. 2018లో గచ్చిబౌలి సమీపంలోని ఖానామెట్‌లోని భూమిని సాయి సింధు ఫౌండేషన్ ట్రస్ట్‌కు కేటాయించాలని జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO)ను కొట్టివేసింది. రూ.500 కోట్లకు పైగా విలువైన భూమిని తక్కువమొత్తంలో లీజుకు ఇవ్వడమెంటని ప్రశ్నించింది. ఈ విధానం చూస్తుంటే అప్పనంగా ఇచ్చినట్లుందని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఈ నేపథ్యంలో ఊర్మిళ పింగిల్, సురేష్ కుమార్ తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తెలంగాణ హైకోర్టు ఈ మేరకు స్పందించింది.
మార్చి 22, 2018 నాటి జీఓ 59 ప్రకారం క్యాన్సర్, ఇతర వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రి నిర్మాణానికి 33 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి రూ.1.47 లక్షల నామమాత్రపు లీజుకు భూమి(land)ని ఫౌండేషన్‌కు కేటాయించారు. భూమి మార్కెట్ విలువ చదరపు గజం రూ.75,000, మొత్తం రూ.500 కోట్లకుపైగా ఉంటుందని వార్షిక లీజు మొత్తం రూ.50 కోట్లు మాత్రమేనని పిటిషనర్లు జిల్లా కలెక్టర్ నివేదికను కోర్టుకు సమర్పించారు. అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ఈ కేసులో ఆర్థిక కోణం మాత్రమే పరిగణించరాదని ప్రసాద్ కోర్టు ముందు వాదించారు. ఎందుకంటే క్యాన్సర్ కారణంగా మరణాలు ఇప్పుడు దేశంలో అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాయి సింధు ఫౌండేషన్ చైర్పర్సన్ హెటెరో గ్రూప్ సీఈవోగా పనిచేస్తున్నారని కూడా ఆయన సూచించారు.