కృష్ణా: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను జిల్లా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,60,000 లక్షల విలువ చేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. గంజాయి రవాణా చేసేవారు సేవించే వారిపై నిఘా ఉంచుతూ వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.