KKD: SP బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా SP మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.