ఈవీ స్కూటర్ల మార్కెట్లో టీవీఎస్, బజాజ్ సత్తా చాటాయి. ఫిబ్రవరి నెలలో టీవీఎస్ మోటార్స్ 31,600 యునిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 67 శాతం అధికం. అలాగే గత నెలలో బజాజ్ ఆటోకి చెందిన 25,323 యూనిట్లు, ఏథర్ ఎనర్జీకి చెందిన 20,581 యూనిట్లు, మోటోకార్ప్‌కు చెందిన 12,512 యూనిట్లు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్‌కి చెందిన 4,725 యూనిట్లు అమ్ముడయ్యాయి.