MNCL: చదువే మనిషికి జీవం కావాలని, విద్యను ఇష్టపడుతూ చదవాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రేరణాత్మక వక్త, రాష్ట్రపతి అంతర్జాతీయ అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అన్నారు. మంగళవారం జైపూర్ మండలం టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం “చదువు.. బడి.. తల్లిదండ్రులు.. పరీక్షలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.