NTR: ఇబ్రహీంపట్నంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నూతన ట్రాఫిక్ సీఐ డి. చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం రింగ్ సెంటర్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణరక్షణ కవచంగా ఉంటుందని చెప్పారు.