»Young Director Lokesh Kanagaraj Insulted Prabhas And Ram Charan
Lokesh kanagaraj: ప్రభాస్, చరణ్‌కు యంగ్ డైరెక్టర్ అవమానం!?
ఒక్క సినిమా హిట్ కొడితే చాలు.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) క్రేజ్ కూడా అలాగే ఉంది. ఏకంగా చరణ్, ప్రభాస్‌నే పక్కకు పెట్టేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో.. సాలిడ్ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు లోకేష్(lokesh kanagaraj). అందుకే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ ఫిల్మ్ కోసంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఇళయ దళపతితో ‘లియో’ ప్రాజెక్ట్ చేస్తుండడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దాంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో లోకేష్ కనగరాజ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అయనతో సినిమాలు చేసేందుకు బడా బడా స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఈయన చేసే మాస్ కంటెంట్ మూవీస్ వేరే లెవల్లో ఉంటాయి. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోకి ఉన్న అప్పులన్నీ ‘విక్రమ్’ సినిమాతో తీర్చేశాడు లోకేష్. అందుకే విక్రమ్ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కార్తితో ఖైది సీక్వెల్ ప్రకటించాడు.
ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు లోకేష్. అందుకే తెలుగు హీరోలు పిలిచి మరీ ఆఫర్స్ ఇచ్చినా లోకేష్ ‘నో(n0)’ చెబుతున్నాడట. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు లోకేష్. హైదరాబాద్‌కు ఎప్పుడొచ్చినా చరణ్‌ను కలుస్తుంటాడు. ఇంకా చరణ్‌తో టచ్‌లోనే ఉన్నాడు లోకేష్. అయితే ఇప్పటికే లోకేష్ కనకరాజ్‌కి రెండు సార్లు సినిమా చేద్దామని ఆఫర్ చేశాడట రామ్ చరణ్(ram Charan). ఖైదీ హిట్ అయినప్పుడు ఓసారి, విక్రమ్ తర్వాత మరోసారి లోకేష్‌తో సినిమాకు రెడీ అయ్యాడట చరణ్. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా రెండు సార్లు చరణ్‌ను హోల్డ్‌లో పెట్టాడట.
పోనీ లియో అయిపోయాక చేద్దామని అనుకుంటే.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు కమిట్ అయ్యాడు. దాంతో ఇప్పట్లో చరణ్‌తో లోకేష్ ప్రాజెక్ట్ ఉండేది కష్టమే అంటున్నారు. అంతేకాదు ప్రభాస్(Prabhas) లాంటి పాన్ ఇండియా స్టార్ పిలిచి ఆఫర్ ఇస్తే ఇంతవరకు ఆన్సర్ లేదట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. చరణ్, ప్రభాస్ ఇప్పటికే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. కాబట్టి లోకేష్‌నే వీళ్లు హోల్డ్‌లో పెట్టారనే టాక్ ఉంది. ఏదేమైనా.. లోకేష్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో ప్రభాస్, చరణ్ సినిమా చేస్తే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉంటుందని చెప్పొచ్చు.