KDP: గొల్లపల్లి-జమ్మలమడుగు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. మైలవరం మండలం గొల్లపల్లి నుంచి జమ్మలమడుగు వెళ్లే రోడ్డుపై లారీ, ట్రాక్టర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. లారీ ట్రాక్టరు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.