SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపాల పశువైద్యురాలు డాక్టర్ మమత విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. పశువైద్య రంగంలో ఆమె అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ, ఈరోజు సూర్యాపేటలో జిల్లా ఎస్పీ నరసింహ ఆమెను ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణించాలన్నారు.