JGL: జగిత్యాల-లింగంపేట రైల్వేస్టేషన్ దారిలో దుర్గంధం వెదజల్లుతోంది. రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రారంభ మార్గంలోనే చెత్తాచెదారం వేయడంతో పాటు కుక్కలు తిరుగుతుండటం వల్ల రోడ్డంతా కంపు కొడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.