ఘట్టమనేని జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవికతకు దగ్గరగా మనసుల్ని హత్తుకునే ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నాడు. ఇప్పటివరకూ ఇలాంటి కథను ఎవరూ రూపొందించలేదని, ఆ ప్రేమలో అమాయకత్వం, భావోద్వేగం అన్నీ ఉంటాయని తెలిపాడు.