ASF: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ హరిత అన్నారు. కాగజ్ నగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్లకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక భూమిక ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు.