»Ajio 2023 Big Bold Sale Unbeatable Discounts June 1st 2023
AJIO: మరో బోల్డ్ సేల్ ప్రకటించిన అజియో..!
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ AJIO జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానున్న తన 'బిగ్ బోల్డ్ సేల్'ని ప్రకటించింది. ఈ మెగా సేల్ కోసం వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
రిలయన్స్ కి చెందిన ప్రముఖ ఆన్ లైన్ రీటేల్ స్టోర్ అజియో(AJIO) గురించి పరిచయం చేయాల్సిన అసవరం లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది కేవలం ఈ ఆన్ లైన్ స్టోర్ నుంచే దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లతో జనాలను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరో బిగ్ బోల్డ్ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందుగా మే 28 నుంచి ఖాతాదారులకు రోజుకు 6 గంటలపాటు పరిమిత యాక్సెస్ ఇస్తున్నట్టు అజియో తెలిపింది.
ఈ సేల్లో 5000కుపైగా బ్రాండ్ల నుంచి 13 లక్షల ప్యాషన్ ఉత్పత్తుల్ని ఖాతాదారులు ఎంచుకోవచ్చు. టాప్ బ్రాండ్స్ నుంచి ప్రత్యేక ఆఫర్లతో పాటు 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్కార్డ్లపై అదనంగా 10 శాతం తగ్గింపు ధర ఉంటుంది. ఆడిడాస్, నైక్, పుమా, సూపర్డ్రై, గాప్, లెవిస్ తదితర టాప్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని అజియో(AJIO) వెల్లడించింది.