Teja దేవుడు.. దగ్గుబాటి వారసుడిగా కాదు, నటుడిగా చూడండి: అభిరామ్
దర్శకుడు తేజ తనకు దేవుడు అని దగ్గుబాటి అభిరామ్ అన్నారు. తేజ దర్శకత్వంలో వస్తోన్న అహింస మూవీతో అభిరామ్ తెరంగ్రేటం చేస్తున్నారు. మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.
Daggubati Abhiram: దర్శకుడు తేజ (teja) తన దేవుడు అని దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) అంటున్నారు. తేజ దర్శకత్వంలో అభిరామ్ ‘అహింస’ మూవీతో తెరంగ్రేటం చేశారు. ఆ సినిమా జూన్ 2వ తేదీన విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో అభిరామ్, తేజ పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమాలు అంటే తనకు ఇష్టం అని అభిరామ్ (Abhiram) చెప్పారు. ఇన్నిరోజులు అందుకోసమే వెయిట్ చేశానని తెలిపారు. అహింస అలాంటి కథే అని.. అందరికీ నచ్చుతుందని తెలిపారు. తేజ (teja) దర్శకత్వంలో పనిచేయడం తన అదృష్టం అని.. జీరోగా ఉన్న తనకు ఓ రేంజ్‌కు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అహింస మూవీతో తన లెవల్ పెరుగుతుందని పేర్కొన్నారు. తన గుర్తింపు కోసం తేజ కష్టపడ్డారని.. తన దృష్టిలో ఆయన నిజమైన హీరో అని అభిరామ్ అన్నారు. సినిమా చేసే సమయంలో తనకు ఎన్నో విషయాలు నేర్పించారని తెలిపారు. తన నటనను బట్టి గుర్తింపు ఇవ్వాలని కోరారు. టాప్ ప్రొడ్యూసర్ కుమారుడిగానో.. రానా తమ్ముడిగానో గుర్తించవద్దని కోరారు. మూవీ చూశాక బాబాయ్ వెంకటేష్ కొన్ని సూచనలు ఇచ్చారని అభిరామ్ (Abhiram) వివరించారు.
మూవీ మొఘల్ రామానాయుడుకు ఇచ్చిన మాట కోసం అహింస మూవీ చేశానని డైరెక్టర్ తేజ అన్నారు. అహింసలో అభిరామ్ (Abhiram) సరసన గీతక నటించింది. సదా కూడా కీ రోల్ పోషించారు. తేజ మూవీస్ డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. చిత్రం, నువ్వే నువ్వే, జయం, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చిత్రం మూవీ తర్వాత వరసగా విజయాలు వచ్చాయి. నువ్వే నువ్వే అప్పట్లో బ్లాక్ బ్లస్టర్.. జయం కూడా సూపర్ హిట్ మూవీ.. ఆ తర్వాత తేజకు విజయాలు లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీతో ముందుకు వచ్చారు.