SRD: ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ షెడ్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కుసంగి సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ కోరారు. గ్రామంలో 9 మంది రైతులకు ప్రాజెక్టు అధికారి భగవాన్ రెడ్డితో కలిసి 75 శాతం సబ్సిడీతో కూడిన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. సాగును సులభతరం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ప్రోత్సాహకాలను రైతులు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.