ప్రకాశం: మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో వెలిసిన శ్రీ ముద్దసానమ్మ అమ్మవారిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కొండారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ముద్దసానమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.