గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే గుబ్బకాయలు ఆయుర్వేదంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి గుజ్జు గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఆకులతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీని కషాయం మొండి గాయాలను మాన్పడమే కాక జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా, పంటలకు సహజ కీటక నాశినిగా కూడా పనిచేసి రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం.