SRPT: పదవతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకాంక్షించారు. కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఇవాళ సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి, ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ధైర్యం చెప్పారు.