NZB: సాలురా మండలం ఖాజాపూర్లో NCCF ఆధ్వర్యంలో ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ నాగయ్య, నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ ప్రారంభించారు. క్వింటాకు రూ.5,875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు ఛిద్రపు గంగారాం, మోహన్ పాల్గొన్నారు.