W.G: భీమవరం పట్టణ అభివృద్ధిలో దాతల సహకారం పాత్రల ఎంతో ఉందని, వారి సహాయ సహకారాలు మరువలేనివని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం-తాడేరు రోడ్డులో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారం ఆర్చ్‌ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు.