BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అనంతరం స్థానిక హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్లను మంత్రి చేతుల మీదగా అందజేయనున్నట్లు జయకృష్ణ తెలిపారు.