SKLM: మంచు విపరీతంగా కురుస్తుండడంతో జిల్లాలో ఉన్న మామిడి పంటకు నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం ఆ పంటపై ఆధారపడుతూ చాలా మంది యజమానులతో పాటు ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. గత కొద్ది నెలల నుంచి పొగ మంచు దెబ్బకు మామిడి పూత మాడిపోగా, పిందెలు సైతం మాడిపోతున్నాయి. ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో పలు మండలాలలో ఇలా ఉంది.